నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని గండి రామన్న దత్తసాయి ఆలయంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమారెడ్డి, బీజేపీ నాయకులు రావుల రాంనాథ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు గురు పౌర్ణమి గొప్పతనం, గురువు ప్రాధాన్యతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్షా సేవ సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రంగు రవి కిషన్, ఆలయ ఈవో భూమయ్య, సాయి దీక్ష సేవా సమితి సభ్యులు మూర్తి మాస్టర్, ఆమెడ శ్రీధర్, రేణుకా దాస్, ఉప్పుల నందు, నారాయణరెడ్డి, లింగారెడ్డి, జిందన్ గోవర్ధన్, కోల శంకర్, శ్రీనివాస్, సతీష్, రేఖ, మాధవి, భక్తులు పాల్గొన్నారు.


