కుంటాల: ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతీ ఓటరు సీ రియస్‌గా తీసుకోవాలని సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సూచించారు. బుధవారం కుంటాల తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్‌వోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడా రు. ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్నవారు సకాలంలో బీఎల్‌వోలకు అందించాలని, లేని పక్షంలో ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ లక్ష్యాన్ని పూర్తిచేసి జిల్లాలో ఫస్ట్, స్టేట్‌లో సెకండ్ స్థానంలో నిలి చేందుకు కృషి చేసిన తహసీల్దార్ కమల్ సింగ్ ను అభినందించారు. ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో ఉత్తమ పనితీరు కనబర్చిన ఆర్‌ఐ రాజేశ్వర్, అందకూర్ బీఎల్‌వో విమలను సన్మానించారు. సమావేశంలో డీటీ కార్తీక్‌రెడ్డి, ఆర్‌ఐలు రాజేశ్వర్, అడెల్లు, తదితరులు పాల్గొన్నారు.


