నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దొడ్డికింది నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని మహేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, నాయకులు సాదం అరవింద్, జంగం వీరేష్ , జమాల్, జుట్టు దినేష్, ఇర్ల విజయ్, శ్రీకాంత్‌రెడ్డి, కందుల హరీష్, భరత్, కౌన్సిలర్లు రాజు, నరేష్, శశాంక్, తదితరులు పాల్గొన్నారు.


