వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Jul 30 2026 12:15 AM | Updated on Jul 30 2026 12:15 AM

వాతావరణం

ఆకాశం పూర్తిగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈదురుగాలులు వీస్తాయి. జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

కొట్టుకుపోయిన

ధర్మారం–సోన్‌ రోడ్డు

లక్ష్మణచాంద: మండలంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ధర్మారం నుండి సోన్‌కు వెళ్లే రోడ్డుమార్గంలో పీచర సమీపంలో లోలెవల్‌ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ధర్మారం, పీచర గ్రామాల మీదుగా సోన్‌ మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఏటా భారీ వర్షాలకు రోడ్డు కొట్టుకుపోవడం, అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేయడం జరుగుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత చర్యలు చేపట్టాలని మండలవాసులు కోరుతున్నారు.

నిలిచిన రాకపోకలు

ఖానాపూర్‌: పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి హైటెక్‌ సిటీకి వెళ్లే మార్గంలో రెంకొని వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చందు నాయక్‌ తండా శివారులో పల్కేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు గ్రామాల్లో వరద నీరు పంట పొలాల్లోకి చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement