భైంసారూరల్: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు. బుధవారం భైంసాలోని తన నివాసంలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల వార్డెన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, తదితర మౌలిక వసతులు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి లత, వివిధ వసతి గృహాల వార్డెన్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్


