కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించిన ఎస్‌ఈ | - | Sakshi
Sakshi News home page

కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించిన ఎస్‌ఈ

Jul 30 2026 12:15 AM | Updated on Jul 30 2026 12:15 AM

కడెం: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సుభాష్‌ కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. విద్యుత్‌ సరఫరా, పరీవాహక ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లను పరిశీ లించారు. వరదల దృష్ట్యా ప్రాజెక్ట్‌కు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీ సుకోవాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించా రు. ఆయన వెంట ఎస్సై సాయికిరణ్‌, ఏఈఈ రాంసింగ్‌, ప్రాజెక్ట్‌ అధికారులు ఉన్నారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు

అప్రమత్తంగా ఉండాలి

కడెం: ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్ట్‌ వరద గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందువల్ల కడెం, దస్తురాబాద్‌ మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ ఖాజా మొయినొద్దీన్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కమాండర్‌ మన్మోహన్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం కడెం ప్రాజెక్ట్‌, పరిసరాల ప్రాంతాల్లో పర్యటించారు. వారి వెంట ఎస్సై సాయికిరణ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నవీన్‌, లింగమూర్తి, సందీప్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement