న్యూస్‌రీల్
నిర్మల్ డాక్టర్‌కు పురస్కారం
నిర్మల్: జిల్లాకేంద్రానికి చెందిన ఫెర్టిలిటి వైద్యురాలు చంద్రిక అవినాష్ రాష్ట్రస్థాయి ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రదానోత్సవంలో గైనకాలజీ విభా గంలో రోగులకు మెరుగైన సేవలు అందించినందుకుగాను ఈ పురస్కారం దక్కింది. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా డాక్టర్ చంద్రిక అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు, కుటుంబ సభ్యులు, దేవీ బాయి ఆస్పత్రి సిబ్బంది హర్షం వ్యక్తంచేశారు.
నిర్మల్‌చైన్‌గేట్: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపునకు దరఖాస్తుదారులు పెద్దగా స్పందించడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్–2020 స్కీం కింద ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ ఈ నెల 31తో గడువు విధించినా జిల్లాలో ఆశించిన స్థా యిలో చెల్లింపుదారులు ముందుకు రావడంలేదు. దరఖాస్తుదారుల్లో చాలామంది ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, కొందరు ప్లాట్లు కూడా విక్రయించారు. దీంతో రెండు విడతల్లో ప్రభుత్వం రాయితీ ప్రకటిస్తే.. అంతంత మాత్రంగానే ముందుకువకొ చ్చారు. జిల్లాలో మున్సిపాలిటీలకు దరఖాస్తులు అ ధికసంఖ్యలో వచ్చినా ఫీజు చెల్లింపులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్లాట్ల క్షేత్రస్థాయి పరిశీలనను అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో పాటు ఫీజు చెల్లించిన వారికి ప్రొసీడింగ్స్ జారీలో తీవ్రజాప్యం జరుగుతుండటంతోనే దరఖాస్తుదారులు ఫీజు చెల్లింపునకు ముందుకు రావడంలేదని తె లుస్తోంది. అప్పట్లో చాలామందికి అవగాహన లేక ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తే, ప్రభుత్వానికి ఫీజుల రూపంలో మరింత ఆదాయం సమకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రచారంలో వెనుకబాటు
అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవా రు ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేసింది. కానీ, 25శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మున్సి పాలిటీలు వెనుకబడ్డాయి. విస్తృత ప్రచారం చేపట్టకపోవడంతో చాలామంది రాయితీపై ఫీజు చెల్లించేందుకు ముందుకు రాలేదనే ఆరోపణలున్నాయి. మొ దట్లో బ్యానర్ల ద్వారా కొద్దిరోజులు ప్రచారం నిర్వ హించి వదిలేసినట్లు ప్రచారం సాగుతోంది. ఫలితంగా ఫీజు చెల్లింపు గడువు ముగిసే సమయానికి ప్ర భుత్వానికి రావాల్సిన ఆదాయం సమకూరే అవకా శం కనిపించడం లేదు. గడువు ముగిసిన తర్వాత 25శాతం రాయితీ వర్తించకపోవచ్చని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధిపొందాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో లక్ష్యం దాటలే..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మంది కూడా ఫీజు చెల్లించలేదు. మొత్తం 26,537 మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేయగా.. ప్లాట్ల యజమానులకు నేరుగా ఫీజు చెల్లింపు సమాచారాన్ని పంపించారు. ఇందులో 3,126 దరఖాస్తులను వివిధ దశల్లో తిరస్కరించారు. 21,850 దరఖాస్తులను ఆమోదించారు. ఇప్పటివరకు చేపట్టిన మూడు విడతల్లో 5,104 మంది ఫీజు చెల్లించారు. ఇంకా 16,746 మంది ఫీజు చెల్లించాల్సి ఉంది.
గజ్జలమ్మా.. కరుణించమ్మా..
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల్లో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ పూజలు చేశారు. కుంటాలకు చెందిన చేపూరి లక్ష్మీవిశారద, ది వంగత చంద్రప్రకాశ్ కుమారుడు వినయబా బు రూ.35వేల విలువైన 2.2 గ్రాముల బంగా రు పుస్తెలు చేయించి మొక్కు చెల్లించుకున్నా రు. వీరిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. అర్చకులు శ్రీకాంత్ రామానుజదాస్, న గేశ్ ఆధ్వర్యంలో గజ్జలమ్మకు అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, పల్లకీసేవ తదితర పూ జలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు.
జిల్లాకు సంబంధించి
దరఖాస్తుల వివరాలు
వచ్చిన దరఖాస్తులు 44,602
చెల్లింపునకు అర్హత పొందినవి 37,939
ఫీజు చెల్లించిన వారు 10,446
ఇంకా చెల్లించాల్సినవారు 29,624
మండలాల వారీగా దరఖాస్తులు ఇలా..
మండలం దరఖాస్తులు ఫీజు అనుమతి ఫీజు చెల్లించినవి చెల్లించాల్సినవి
పొందినవి
బాసర 2,607 2,384 547 1,837
భైంసా 1,581 1,415 227 1,188
దస్తురాబాద్ 6 6 0 6
దిలావర్‌పూర్ 174 148 19 129
కడెం 77 66 9 57
ఖానాపూర్ 1,650 1,574 278 1,296
కుభీర్ 622 301 20 281
కుంటాల 388 350 74 276
లక్ష్మణచాంద 269 253 28 225
లోకేశ్వరం 346 294 50 244
మామడ 59 58 5 53
ముధోల్ 650 559 79 480
నర్సాపూర్(జి) 218 190 53 137
నిర్మల్‌రూరల్ 5,607 5,128 1,158 3,970
పెంబి 65 40 4 36
సారంగపూర్ 1,991 1,889 385 1,504
సోన్ 1,588 1,299 270 1,029
తానూర్ 167 135 24 111
ఖానాపూర్ 1,929 1,518 219 1,299
నిర్మల్ 15,550 12,987 3,788 9,199
భైంసా 9,058 7,345 1,097 6,248
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం కల్పించిన 25శాతం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రిబేట్ ఈ నెల 31వ తేదీతో ముగుస్తుంది. అర్హులైన దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ ఫీజుతో తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలి. మున్సిపాలిటీ తరఫున దీనిపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. చివరి నిమిషం వరకు వేచిచూడకుండా దరఖాస్తుదారులు వెంటనే ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
– రవిబాబు,
నిర్మల్ మున్సిపల్ కమిషనర్
మూడు దశల్లో పరిశీలన
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన మూడు దశల్లో చేపడుతున్నారు. మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులు సంయుక్తంగా ప్లాట్లను పరిశీలించి.. నిబంధనల మేరకు క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మొదటి దశలో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాల్సి ఉంది. రెండో దశలో మరోసారి వివరాలు ధ్రువీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. చివరి దశలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే మున్సిపల్ కమిషనర్ తుది ప్రొసీడింగ్ జారీ చేస్తున్నారు.


