ఈ కేవైసీ పూర్తయ్యేనా? | - | Sakshi
Sakshi News home page

ఈ కేవైసీ పూర్తయ్యేనా?

Jul 27 2026 1:36 AM | Updated on Jul 27 2026 1:36 AM

● జిల్లాలో 91.17 శాతం ప్రక్రియ ● రేషన్‌కార్డుదారులకు తప్పనిసరి

భైంసాటౌన్‌: పౌరసరఫరాల శాఖ తెల్లరేషన్‌కార్డు దారులకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. ఈనెల 31లోపు కార్డులోని కుటుంబ స భ్యులంతా సమీప రేషన్‌ డీలర్‌ వద్ద ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ కేవైసీ చేసుకోనివారికి ఆగస్టు నుంచి రేషన్‌ కోటా నిలిపివేస్తామని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారంలో పంపిణీ చేయనున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డులు కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకున్నవారికే ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. లబ్ధి దారులందరికీ రేషన్‌ సక్రమంగా అందించేందుకు, మరణించిన, అనర్హుల పేర్లు తొలగింపు, నకిలీ కార్డులు ఏరివేసేందుకే కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో 412 రేషన్‌ దుకాణాలున్నాయి. వీటి పరిధిలో అన్నపూర్ణ, అంత్యోదయ, తెల్లకా ర్డుదారులకు ప్రతీనెల 4,867.16 మెట్రిక్‌ ట న్నుల బియ్యం అందిస్తున్నారు. ఆగస్టు నుంచి మూడునెలల కోటా ఒకేసారి పంపిణీ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 2,49,606 కార్డులుండగా, ఇప్పటివరకు 91.17 శాతం కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయింది. అ లాగే, 7,74,020 మంది లబ్ధిదారులుండగా, 73.27 శాతమే ప్రక్రియ పూర్తయింది. మిగతావారూ గడువులోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తప్పనిసరిగా చేయించుకోవాలి

ప్రభుత్వం రేషన్‌కార్డులకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. ఈనెలాఖరుతో గడువు ముగుస్తుంది. సమీప రేషన్‌ దుకాణాల్లో ఎక్కడైనా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దూరప్రాంతాల్లో పిల్లలుంటే అక్కడి రేషన్‌ దుకాణాల్లోనూ చేయించుకోవచ్చు.

– రాజేందర్‌, డీసీఎస్వో

జిల్లాలోని రేషన్‌ సమాచారం

మొత్తం రేషన్‌కార్డులు 2,49,606

లబ్ధిదారుల సంఖ్య 7,74,020

కేవైసీ పూర్తయిన కార్డులు 2,27,554

కేవైసీ పూర్తయిన లబ్ధిదారులు 5,67,129

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement