నిర్మల్: అఖిల భారత యాదవ మహాసభ యు వజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా శీల మణిదీప్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేర కు రాష్ట్ర అధ్యక్షుడు గోర్ల యశ్వంత్‌రాజ్ యాద వ్, జాతీయ ప్రధానకార్యదర్శి లక్ష్మ ణ్‌యాదవ్ చేతుల మీదుగా ఆదివారం హైదరాబాద్‌లో నియామక పత్రాన్ని అందుకున్నారు. యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్రనాథ్ యాదవ్ ఆమోదంతో ఈ నియామకం చేపట్టినట్లు యశ్వంత్‌రాజ్ యాదవ్ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర నాయకత్వానికి మణిదీప్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ పట్టణంలోని అత్యంత పురాతాన గండి రామన్న దత్తసాయి ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్‌గా పట్టణానికి చెందిన కొట్టే శేఖర్ నియమితులయ్యరు. ఈమేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మ కర్తలుగా ఓద్నామ్ నర్సయ్య, ఆనంద్, రాథోడ్ పంచపూల, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రోహిత్ కుమార్ గౌతమ్‌ను నియమించారు. వీరి పదవీకాలం రెండేళ్లపాటు ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. ఆలయాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.


