లక్ష్మణచాంద: మండలంలోని పార్‌పెల్లి గ్రామ సమీ పానగల గోదావరి నది ఒడ్డునున్న రామాలయం వె నుక భారీ మర్రి వృక్షం ఉంది. దాదాపు మూడు గుంటల విస్తీర్ణంలో ఇది విస్తరించింది. ఊడలు భూ మిలోకి దిగి మరిన్ని వృక్షాలుగా ఎదిగాయి. గోదా వరి నీటి ప్రవాహానికి చెట్టు దెబ్బతినకుండా ఉండేందుకు గ్రామస్తులు చుట్టూ సిమెంట్ గద్దె నిర్మించారు. ఇది గ్రామస్తులు, మూగజీవాలకు నీడనిస్తూ సేద తీరుస్తోంది. ఈ వృక్షం గురించి సారంగపూర్ డిప్యూటీ ఎఫ్‌ఆర్వో నజీర్‌ఖాన్‌ను సంప్రదించగా.. ఇది 80ఏళ్ల మర్రి వృక్షమని పేర్కొన్నారు.


