● రెండేళ్లయినా అందని రుణాలు ● తీవ్ర నైరాశ్యంలో నిరుద్యోగులు ● కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ ● సర్కారు నుంచి స్పష్టత కరువు | - | Sakshi
Sakshi News home page

● రెండేళ్లయినా అందని రుణాలు ● తీవ్ర నైరాశ్యంలో నిరుద్యోగులు ● కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ ● సర్కారు నుంచి స్పష్టత కరువు

Jul 26 2026 3:14 AM | Updated on Jul 26 2026 3:14 AM

● రెండేళ్లయినా అందని రుణాలు ● తీవ్ర నైరాశ్యంలో నిరుద్యోగులు ● కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ ● సర్కారు నుంచి స్పష్టత కరువు

నిర్మల్‌చైన్‌గేట్‌: నిరుద్యోగ యువతకు స్వయం ఉ పాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపె ట్టిన రాజీవ్‌ యువ వికాసం అమలు ప్రశ్నార్థకంగా మారింది. వివిధ యూనిట్లకు సబ్సిడీ రుణాల కో సం దరఖాస్తు చేసుకున్న వేలాదిమంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నిత్యం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వ మూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

జిల్లాలో 35వేలకు పైగా దరఖాస్తులు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి రాజీవ్‌ యువ వికాసం పథకం కింద రాయితీ ర ణాలు ఇవ్వడానికి నిర్ణయించింది. 2025 జూన్‌ 2 నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగ యువత నుంచి సుమారు 35వేలకు పైగా దరఖాస్తులు స్వీకరించింది. అర్హులను ఎంపిక చేసి మంజూరైన యూని ట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. చివరి క్షణంలో రుణాల పంపిణీ వాయిదా వేసింది.

యూనిట్లు.. సబ్సిడీలు ఇలా..

రాజీవ్‌ యువ వికాసం కింద వివిధ యూనిట్లకు ఇ చ్చే సబ్సిడీ రుణ మొత్తాన్ని ఐదు రకాలుగా ప్రభుత్వం విభజించింది. రూ.50వేల యూనిట్‌కు మాత్ర మే 100శాతం సబ్సిడీతో రుణం ఇవ్వనున్నట్లు తెలి పింది. రూ.లక్ష యూనిట్‌లో రూ.90వేలు ప్రభుత్వం రాయితీ ఇవ్వనుండగా, రూ.10వేలు బ్యాంక్‌ రుణంగా, రూ.2లక్షల యూనిట్‌లో రూ.1.60 లక్షలు ప్రభుత్వం, రూ.40 వేలు రుణం, రూ.3లక్షల యూనిట్‌లో రూ.2.10 లక్షలు ప్రభుత్వం, రూ.90 వేలు రుణం, రూ.4లక్షల యూనిట్‌లో రూ.2.80 ల క్షలు ప్రభుత్వం రాయితీ ఇవ్వనుండగా, రూ.1.20 లక్షలు బ్యాంక్‌ రుణంగా ఇవ్వాలని నిర్ణయించింది.

షెడ్యూల్‌ ప్రకటించి..

లబ్ధిదారులను ఎంపిక చేసి ఐదు విడతల్లో రుణాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. 2025 జూన్‌లో రూ.50వేల నుంచి రూ.లక్ష యూనిట్లను లక్ష మందికి, జూలైలో రూ.లక్ష నుంచి రూ.2లక్షల యూనిట్లను లక్ష మందికి, ఆగస్టులో రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల యూనిట్లను లక్ష మందికి, సెప్టెంబర్‌లో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల యూనిట్లను లక్ష మందికి, అక్టోబర్‌లో రూ.4 లక్షల యూనిట్లను మరో లక్ష మందికి ఇవ్వనున్నట్లు నిర్ణయించింది.

దరఖాస్తుదారుల్లో నిరాశ

తెలంగాణ ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం యూ నిట్ల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేయడంతో దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తొలుత దరఖాస్తుదారులకు మండల పరిషత్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ తర్వాత అర్హులైన వారికి యూనిట్‌ విలువ ప్రకారం ఐదు విడతల్లో గత అక్టోబర్‌ వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలివిడతలో కేటగిరి–1లో రూ.50 వేలు, కేటగిరి–2లో రూ.లక్ష వరకు ఎంపికై న వారికి మంజూరు పత్రాలు పంపిణీ చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, ఈ ప్రక్రియ వాయిదా పడటంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.

ఆదేశాలు రావాల్సి ఉంది

రాజీవ్‌ యువ వికాసానికి సంబంధించి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని జూన్‌ 2న ప్రారంభించాలని భావించినా కొన్ని కారణాలతో వాయిదా వేసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తాం.

– శ్రీనివాస్‌, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి

మండలాలు, కార్పొరేషన్ల

వారీగా వచ్చిన దరఖాస్తులు

మండలం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ

బాసర 25 196 403 115

భైంసా 82 638 1,228 253

దస్తురాబాద్‌ 161 302 488 2

దిలావర్‌పూర్‌ 130 191 534 163

కడెం 412 690 930 83

ఖానాపూర్‌ 274 536 957 67

కుభీర్‌ 469 431 1,234 107

కుంటాల 94 261 799 89

లక్ష్మణచాంద 103 280 717 78

లోకేశ్వరం 110 431 811 74

మామడ 325 238 501 124

ముధోల్‌ 95 338 586 298

నర్సాపూర్‌ (జి) 88 229 644 164

నిర్మల్‌ రూరల్‌ 178 334 869 70

పెంబి 207 97 234 20

సారంగపూర్‌ 499 425 1,387 160

సోన్‌ 101 204 722 75

తానూర్‌ 143 375 755 95

భైంసా (ము) 21 383 952 1,218

ఖానాపూర్‌ (ము) 28 259 784 340

నిర్మల్‌ (ము) 82 514 2,757 2,376

జిల్లా కేంద్రానికి చెందిన పరమేశ్వర్‌ ఆటో కొనుగోలు చేయడానికి రాజీవ్‌ యువ వికాసం కింద రూ.4లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సిబిల్‌ స్కోర్‌ బాగుండటంతో బ్యాంకర్లు అతనికి జాబితాలో మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. రెండేళ్లయినా పరమేశ్వర్‌కు రుణం మంజూరు కాలేదు. ఆటో నడిపి ఉపాధి పొందుతామని ఆశించిన అతడు ఆందోళన చెందుతున్నాడు. ఇలా జిల్లాలోని చాలామంది దరఖాస్తుదారులు రాయితీ రుణాల కోసం ఎదురుచూస్తున్నారు.

కార్పొరేషన్‌ దరఖాస్తులు మంజూరైన రాయితీ

యూనిట్లు (రూ.కోట్లలో)

ఎస్సీ 7,350 2,894 39.96

ఎస్టీ 3,627 2,325 25.35

బీసీ 17,286 3,876 41.00

ఏంబీసీ/

ఈబీసీ 923 842 8.90

మైనార్టీ 5,926 1,045 17.41

క్రిస్టియన్‌ 65 27 0.42

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement