ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళి | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళి

Jul 26 2026 3:14 AM | Updated on Jul 26 2026 3:14 AM

ముధోల్‌: నీట్‌ పేపర్‌ లీకేజీతో ఆత్మహత్యకు పాల్ప డ్డ విద్యార్థులకు శనివారం మాజీ ఎమ్మెల్యే విఠల్‌రె డ్డి, కాంగ్రెస్‌ నాయకులు మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కు టుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇ వ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన కార్యదర్శి పోతన్నయాదవ్‌, మండలాధ్యక్షుడు సాపేవార్‌ కిష్టయ్య, అఫ్రోజ్‌ఖాన్‌, మగ్ధమ్‌, సూర్యంరెడ్డి, విశ్వంభర్‌, బాబు, సమీఉల్లాఖాన్‌, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటన, విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిని నిరసిస్తూ పట్టణంలో వివేకానంద చౌక్‌ నుంచి అంబేడ్కర్‌ చౌక్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు, మాజీ మంత్రి ఐకేరెడ్డి, నిర్మల్‌ ఏఎంసీ చైర్మన్‌ సోమ భీంరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అర్జుమంద్‌ అలీ, అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement