అధికారులను అవమానిస్తారా? | - | Sakshi
Sakshi News home page

అధికారులను అవమానిస్తారా?

Jul 26 2026 3:14 AM | Updated on Jul 26 2026 3:14 AM

● ఎమ్మెల్యే వైఖరిపై కౌన్సిలర్ల ఆగ్రహం ● కౌన్సిల్‌లో మాట్లాడాలని డిమాండ్‌ ● రసాభాసగా బల్దియా సమావేశం

నిర్మల్‌: మున్సిపల్‌ కమిషనర్‌ సహా అధికారులపై ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరికా దని పలువురు కౌన్సిలర్లు మండిపడటంతో నిర్మల్‌ బల్దియా సమావేశం రసాభాసగా సాగింది. జిల్లాకేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం వైస్‌చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇటీవల సమీక్ష పేరిట మున్సిపల్‌ అధికారులను రాజకీయ కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే అవమానించడం సరైన పద్ధతి కాదంటూ అధికార పార్టీకి చెందిన పలువురు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికా రులను గౌరవించే విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని, ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. సంబంధిత అధికారులు ఎస్సీ, బీసీ వర్గాలకు చెందినవారు కావడంతోనే ఇలా వ్యవహరించారా..? అదే స్థానాల్లో అగ్రవర్ణాలకు చెందిన అధికారులు ఉంటే ఇలా ప్రవర్తిస్తారా..? పట్టణంలో అభివృద్ధి పనులకు బీసీ చైర్‌పర్సన్‌ను ఆహ్వానించకుండా అడ్డుకుంటారా..? అంటూ కొందరు కౌన్సిలర్లు ప్రశ్నించారు. పట్టణ అభివృద్ధి పనుల విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని, ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని పలువు రు సభ్యులు పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణల కంటే పట్టణ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని విపక్ష కౌన్సిలర్లు సూచించా రు. ఇందిరమ్మ ఇళ్లు, గుంతలు పడ్డ రోడ్లు, రూ.15 కోట్ల పనుల్లో నిధుల పెంపు, వీధిదీపాలు, తాగునీరు తదితర అంశాలపై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్‌ రవిబాబు సమాధానాలిచ్చారు.

అభివృద్ధికి సహకరించాలి

నిర్మల్‌ ఎమ్మెల్యేగా మున్సిపల్‌ అభివృద్ధికి మహేశ్వర్‌రెడ్డి సహకరించాలని వైస్‌చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తి సూచించారు. మున్సిపల్‌ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో చైర్‌పర్సన్‌ను ఆహ్వానించకపోవ డం ఏమిటని ప్రశ్నించారు. పక్కనున్న ఆదిలాబాద్‌ ఎమ్మెల్యేలాగా నిర్మల్‌కూ నిధులు తీసుకువచ్చేందు కు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సహకరించాలని కోరా రు. కలిసికట్టుగా నిర్మల్‌ను అభివృద్ధి చేసేందుకు క ట్టుబడి ఉంటామని, మున్సిపల్‌ సమావేశాలకు వ స్తే ప్రతీదానికి సమాధానం చెబుతామని చెప్పారు.

మార్కెట్‌, ట్రాఫిక్‌ సమస్య తీర్చాలి

గాంధీ కూరగాయల మార్కెట్‌ సమస్యలు, ఫ్రీలెఫ్ట్‌ లేని చౌరస్తాలు, దుకాణాల ఎదుట టేలాల ఏర్పాటుపై కౌన్సిలర్లు శ్రీకాంత్‌యాదవ్‌, ఎస్‌.పీ.రాజు బ ల్దియా దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై త్వరలోనే చర్యలు చేపడతామని కమిషనర్‌ తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులున్నారు.

మాట్లాడుతున్న గణేశ్‌ చక్రవర్తి

సమావేశంలో వాగ్వాదానికి దిగుతున్న కౌన్సిలర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement