నిర్మల్‌చైన్‌గేట్: జలసిరి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో, పంచాయతీరాజ్ గ్రా మీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, ఇత ర అధికారులతో కలిసి అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులతో శనివారం జలసిరి, వీబీజీ రామ్ జీ పనులు, గ్రామపంచాయ తీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. భవిష్యత్‌లో నీటి సమ స్య తలెత్తకుండా ఉండేందుకు ‘జలసిరి’లో భాగంగా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతీ పంట కు పంట కుంట.. ప్రతీ ఊరికి ఊట కుంట’ నినా దంతో భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. ప్రతీ రైతు పంట పొలాల్లో ఫామ్‌పాండ్ నిర్మించుకునేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల ద్వారా భూగర్భ జలాల సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. వీబీజీ రామ్ జీ కా ర్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప నుల్లో దేశంలోనే ముందువరుసలో ఉన్నామని పే ర్కొన్నారు. అర్హులైన పేద కూలీలందరికీ పని దినా లు కల్పించాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో విజ యలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా అధికారులు


