క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌ తప్పనిసరి

Jul 26 2026 3:14 AM | Updated on Jul 26 2026 3:14 AM

● ఎస్పీ డాక్టర్‌ జానకీ షర్మిల ● హెడ్‌క్వార్టర్‌లో వీక్లీ పరేడ్‌ ● పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష

నిర్మల్‌టౌన్‌: పోలీస్‌ అధికారులు, సిబ్బందికి క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌ తప్పనిసరి అని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. శనివారం జిల్లా పోలీస్‌ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌లో జిల్లాలోని సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ సిబ్బందికి వీక్లీ పరేడ్‌ నిర్వహించారు. సిబ్బంది ప్రదర్శించిన డ్రిల్‌, స్క్వాడ్‌ డ్రిల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్‌ ఫిజి కల్‌ ఫిట్‌నెస్‌కు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు బా గా ఉపయోగపడుతుందని తెలిపారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. విధి నిర్వహణ, ఆరోగ్య, వ్యక్తిగత స మస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని తెలి పారు. చెడు వ్యసనాలతో విధులను నిర్లక్ష్యం చేసి పోలీస్‌శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించరాదని సూచించారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, డీఎస్పీ శ్రీనివాస్‌, అధికారులు సమ్మయ్య, గోవర్ధ న్‌, కృష్ణ, ప్రవీణ్‌, రాంనిరంజన్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

పుష్కరాల భద్రత ఏర్పాట్లపై సమీక్ష

గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా భక్తుల కు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం క ల్పించేందుకు చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై డీజీపీ కార్యాలయం నుంచి ఏడీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌ రాష్ట్రంలోని పుష్కర జి ల్లాల పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి ఎస్పీ జానకీ షర్మిల పాల్గొన్నారు. పుష్కర ఘాట్‌ల వద్ద వాచ్‌ టవర్లు, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్లు, సీసీటీవీ నిఘా వ్యవస్థలు, డ్రోన్‌ సర్వైలై న్స్‌, ట్రాఫిక్‌ నిర్వహణ, అత్యవసర స్పందన బృందాలు లాంటి భద్రత ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఏడీజీపీ ఆదేశించారు. బాసర, సోన్‌, సావర్‌గాం ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూ చించారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, డీఎస్పీ శ్రీని వాస్‌, ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్‌, కృష్ణ, సత్యనారాయణ, దీపక్‌, రవీందర్‌, ఆర్‌ఐ రామ్‌నిరంజన్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement