ఏం చేయాలో అర్థం కావడం లేదు | - | Sakshi
Sakshi News home page

ఏం చేయాలో అర్థం కావడం లేదు

Jul 14 2026 12:00 AM | Updated on Jul 14 2026 12:00 AM

నా కుమారుడు బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం కింద పట్టణంలోని వశిష్ఠ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని సార్లు చెబుతున్నారు. పుస్తకాలు, టై, బెల్ట్‌, దుస్తులకోసం రూ.5,500 ఖర్చు అవుతాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకుంటే మీరే ఇవ్వాలని అంటున్నారు. ఫీజులు చెల్లించే స్థోమత లేదు. పిల్లవాడి చదువు ఆగం అవుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – మసీదు రమేశ్‌, విద్యార్థి తండ్రి

రమ్మనేవారు లేరు..

మా కొడుకుని పట్టణంలోని వశిష్ఠ స్కూల్లో బెస్ట్‌ అవైలబుల్‌ పథకం ద్వారా చేర్పించాను. ఇప్పుడు ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని మా పిల్లలని పాఠశాల యజమాన్యం పట్టించుకోవడం లేదు. దళితులమైన మేం.. బిడ్డలు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివితే మంచిగా చదువు వస్తదని నమ్మి చేర్పించాం. ఇప్పుడు పట్టించుకోకపోతే ఎలా. బడికి రమ్మనేవారు లేరు. – ఎల్లయ్య, విద్యార్థి తండ్రి, నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement