న్యూస్‌రీల్
మోడిఫైడ్ సైలెన్సర్లతో న్యూసెన్స్
వృద్ధుల ఆరోగ్యం, ట్రాఫిక్‌పై ప్రభావం
కానరాని పోలీసుల చర్యలు
‘సర్’.. సైబర్‌తో జాగ్రత్త
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఎత్తుగడలు వేస్తున్నా రు. సర్, బీఎల్‌వో, బీఎల్‌ఏ పేరిట వచ్చే ఫోన్లకు స్పందించొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ప్రతీ విద్యార్థికి నులిపురుగు నివారణ మాత్రలు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వయసున్న ప్రతీ విద్యార్థికి నులిపురుగు నివారణ మాత్రలు(ఆల్బెండజోల్) అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా నిర్మల్ అర్బన్ మండలం సోఫీనగర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సోమవారం ఆల్బెండజో ల్ మాత్రలు పంపిణీ చేశారు. మాత్రలతో నులి పురుగులు నశించి, రక్తహీనత రాకుండా ఉంటుందన్నారు. ఏటా విధిగా మాత్రలు తీసుకో వాలన్నారు. విద్యార్థులంతా ఆహారం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, డీఈవో భోజన్న, ఇమ్యూనైజేషన్ అధికారి నయనారెడ్డి, అధికా రులు రవీందర్, ప్రిన్సిపాల్స్ డానియల్ పాల్గొన్నారు.
నిర్మల్‌టౌన్: నిర్మల్ పట్టణం ప్రశాంతంగా, పచ్చదనంతో కళకళలాడుతూ ఉండేది. అయితే ఇటీవల బైకుల నుంచి వచ్చే అధిక శబ్దాలు ఆ ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. బుల్లెట్ బైకులు, ఇతర వాహనాలకు అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్లు పట్టణవాసుల గుండెల్లో డుగ్..డుగ్..డుగ్ అంటూ బాంబు పేలినట్లు దడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకు ఇలాంటి వాహనాల సంఖ్య పెరుగుతోంది.
యువత స్టేటస్ సింబల్‌గా..
బుల్లెట్ బైక్ మోడల్స్‌లో క్లాసిక్ 350, హంటర్ 350, బుల్లెట్ 350, 650 వంటి వాహనాల సైలెన్సర్లు మార్చడం యువతకు ఒక ఫ్యాషన్‌గా మారింది. ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ మార్పులను స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. కంపెనీ ఇన్‌బిల్ట్ సైలెన్సర్లను తొలగించి రూ.3 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు పెట్టి భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్లు అమర్చుకుంటున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, జనసంచారం ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ శబ్దాలు చేస్తున్నారు.
ఆరోగ్యం, ట్రాఫిక్‌పై ప్రభావం..
అధిక శబ్దం, వల్ల శబ్ద కాలుష్యం పెరుగుతోంది. వృద్ధుల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుండెల్లో దడ పుట్టించే ఈ శబ్దాలు రోజువారీ జీవితంలో ఆందోళన కలిగిస్తున్నాయి.
పోలీసుల చర్యలు శూన్యం..
పోలీసులు మోడిఫైడ్ సైలెన్సర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌లోని మెకానిక్ షాపులు, సర్వీసింగ్ సెంటర్లలో భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రజలు ముందుగా ఈ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఈ సమస్యను నియంత్రించవచ్చని పోలీసులను కోరుతున్నారు.
ఇబ్బంది పడుతున్న నిర్మల్ పట్టణ ప్రజలు


