● ఎమ్మెల్యే పి.రామారావు పటేల్
వైద్య సమస్యలు పరిష్కరించాలి
భైంసాటౌన్: ముధోల్ నియోజకవర్గంలో వైద్యరంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం తన వాణి వినిపించారు. భైంసాలో ఏరియా ఆస్పత్రిలో రెండు వెంటిలేటర్లు, 5 బేబీ వార్మ్ మెషీన్లు, మొబైల్ ఎక్స్‌రే వంటి ఆధునిక వైద్య పరికరాలున్నా.. వాటిని వినియోగంలోకి తేవడం లేదన్నారు. ఫలితంగా పేదలకు వైద్య సేవలందక, ప్రైవేట్‌కు వెళ్లి డబ్బులు వెచ్చిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ముధోల్‌లో 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచాయని, వెంటనే పూర్తి చేయాలన్నారు. బాసరకు 30 పడకల ఆస్పత్రి మంజూరు చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కుభీర్ పీహెచ్‌సీని 30 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని, బాసర ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని విన్నవించారు.


