గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు
బాసర: వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం ఘాట్లు విస్తరించాలని నిర్ణయించింది. విస్తృతంగా ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటినుంచి సన్నాహాలు చేపట్టారు. బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి పుష్కరాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆ మేరకు స్నాన ఘాట్ల విస్తరణ, ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటు, బారికేడింగ్, వాటర్ ప్రూఫ్ టెంట్లు, మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పించనున్నారు. ఈమేరకు తహసీల్దార్ పవన్‌చంద్ర, ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, ఎంపీవో గంగాసింగ్, గ్రామపంచాయతీ ఈవో ప్రసాద్‌గౌడ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు.


