రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫెయిర్‌కు జిల్లా విద్యార్థులు
నిర్మల్‌ఖిల్లా: ఈ నెల 7నుంచి 9వరకు కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్, ఎగ్జిబిషన్‌కు జిల్లా నుంచి ఎంపికై న 55మంది ఇన్‌స్పెర్, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్‌లతో గైడ్ టీచర్, విద్యార్థులు బుధవారం వెళ్లారు. జిల్లా నుంచి 26 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్‌తో బృందం సభ్యులు బచ్చు శ్రీనివాస్, షేక్ రఫీక్ ఆధ్వర్యంలో 55మంది రాష్ట్రస్థాయి ప్రదర్శనకు బయలుదేరారు. విద్యార్థులు చక్కటి ప్రదర్శన కనబరిచి జిల్లాకు మంచి పేరు తేవాలని డీఈవో భోజన్న ఆకాంక్షించారు.


