గ్రామాల్లో క్రీడా సంరంభం
సీఎం కప్ నిర్వహణకు సన్నాహాలు ఈనెల 17 నుంచి పోటీలు ప్రారంభం గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడలు గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి... విజయవంతమైన టార్చ్‌లైట్ ర్యాలీ
గ్రామస్థాయి :
జనవరి 17 నుంచి 22 వరకు
మండల/మున్సిపల్ స్థాయి :
జనవరి 28 నుంచి 31 వరకు
నియోజకవర్గస్థాయి :
ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు
జిల్లా స్థాయి :
ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు
నిర్మల్‌చైన్‌గేట్: జల్లాలోని పల్లెల్లో క్రీడా సందడి మొదలు కానుంది. ఈనెల 17 నుంచి ఫిబ్రవరి 14 వరకు సీఎం కప్ క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ’ప్రపంచ చాంపియన్’ నినాదంతో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు నాలుగు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గ్రామీణ యువతలో దాగిఉన్న ప్రతిభలను వెలికితీయడమే ఈ పోటీల లక్ష్యం. రాష్ట్ర క్రీడాసంస్థ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి షెడ్యూల్ విడుదల చేసింది.
44 అంశాల్లో పోటీలు
అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెస్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్‌తక్రా, చెస్, బేస్‌బాల్, నెట్‌బాల్, కిక్‌బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్ రాక్వెట్, కానోయింగ్–కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్‌లిఫ్టింగ్, సాఫ్ట్‌బాల్, తైక్వాండో, బిలియర్డ్స్–స్నూకర్, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికిల్‌బాల్, సెయిలింగ్, బాల్ బ్యాడ్మింటన్, మల్లకంబ్, పారా గేమ్స్, రిక్రియేషనల్ క్రీడల్లో పోటీలు జరుగుతాయి.
టార్చ్ ర్యాలీ విజయవంతం
పోటీల సన్నాహంలో భాగంగా గురువారం శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన టార్చ్ ర్యాలీ విజయవంతమైంది. జిల్లా యువజన, క్రీడా అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ హైమద్ పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్..
క్రీడాకారులుhttps://satg.telangana.gov. in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌గా పేరు నమోదు చేయాలి. సందేహాలు ఉంటే డీవైఎస్‌ఓ, పాఠశాల– కళాశాల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, పీడీలు, పీఈటీలను సంప్రదించవచ్చు. ఎంపీడీవోలు, ఎంఈవోల వద్ద కూడా సమాచారం అందుబాటులో ఉంది.
గతేడాది విజయాలు
2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి 2 వరకు మొదటి సీఎం కప్ క్రీడలు నిర్వహించారు. జిల్లా క్రీడాకారులు 26 పతకాలు సాధించారు. 4 బంగారు, 8 రజతం, 14 కాంస్య పతకాలు. ఈ పోటీల విజేతలు ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హులవుతారు.
పోటీల షెడ్యూల్


