‘సదర్మాట్’ పనులు త్వరగా పూర్తి చేయాలి
మామడ: పొన్కల్ సదర్మాట్ బ్యారేజీ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గోదావరి వద్ద నిర్మాణంలో ఉన్న బ్యారేజీ ని ఎస్పీ జానకీషర్మిలతో కలిసి గురువారం సందర్శించారు. బ్యారేజీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ రహదారి పనులు పూర్తిచేయాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్ట ర్ కిశోర్‌కుమార్, అదనపు ఎస్పీ సాయికిరణ్, ఆర్డీ వో రత్నకళ్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, నీటిపారుదలశాఖ, అర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు.


