చదువుతోనే సాధికారత
మంచిర్యాలఅర్బన్: బాలికల విద్యను ప్రోత్సహించి సాధికారత దిశగా అడుగులు వేసేలా కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలను ఏ ర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్మల్, మంచిర్యాల జిల్లాల కేజీ బీవీ ప్రత్యేక అధికారులు, మోడల్ హాస్టళ్ల వార్డెన్లకు జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ(ఎన్‌ఐఈపీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజు గురువారం శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేజీబీవీల బలోపేతానికి శిక్షణ కార్యక్రమమని తెలిపా రు. సామర్థ్యాలను పెంపొందించుకుని ఉత్త మ ఫలితాలు సాధించేలా శ్రద్ధ వహించాలని అన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశా రు. బాలిక విద్య ప్రాముఖ్యతపై ప్రదర్శించిన నాటికను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కో–ఆర్డినేటర్లు వి జయలక్ష్మి, భరత్, సత్యనారాయణమూర్తి, చౌ దరి, నిర్మల్ జిల్లా కో–ఆర్డినేటర్లు నవీన జ్యో తి, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ రమాదేవి, మా స్టర్ ట్రైనర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


