నిర్మల్
7
నిర్మల్ పట్టణ సీఐగా నైలు
నిర్మల్‌టౌన్: నిర్మల్ పట్టణ సీఐగా ఎం.నైలు నియమితులయ్యారు. ప్రస్తుత సీఐ ప్రవీణ్‌కుమార్ భైంసా రూరల్ సీఐగా బదిలీ అయ్యారు. బైంసా రూరల్ సీఐగా పనిచేసిన నైలును నిర్మల్‌కు బదిలీ అయ్యారు.
పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తగ్గుతాయి. మంచు అధికంగా కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది.
వసంత పంచమికి పట్టు వస్త్రాలు
బాసర: వసంత పంచమికి శ్రీజ్ఞానసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లతోపాటు వ్యాస మహర్షి, దత్తాత్రేయస్వామికి పట్టువస్త్రాలు తీసుకొస్తామని అఖిలభారత భక్త మార్కండేయ పద్మశాలీయ నిత్యాన్నసత్రం సభ్యులు తెలిపారు. ఈవో అంజనాదేవికి సత్రం అధ్యక్షుడు రాపోలు సుధాకర్, కార్యనిర్వాహక అధ్యక్షురాలు గొజ్జ రాజేశ్వరి, ధర్మకర్త కొక్కుల గంగాధర్, మేకల అశోక్ గురువారం వినతిపత్రం అందజేశారు.
నిర్మల్
నిర్మల్


