అన్నదాతల పోరుబాట
న్యూస్‌రీల్
ప్రత్యేక కెనాల్ నిర్మించాలని డిమాండ్
చివరి వరకు చేరని సదర్‌మాట్ నీరు
దశాబ్దాల డిమాండ్ నెరవేరేదెప్పుడో..!
ఆందోళనబాటలో ఆయకట్టు రైతాంగం
నిర్మల్
గోదావరికి మెస్రం వంశీయులు
మెస్రం వంశీయులు కలమడుగు గోదావరినదికి చేరుకున్నారు. నాగోబా మహాపూజకు అవసరమైన పవిత్ర జలాలను హస్తినమడుగులో సేకరించి తిరుగుపయనమయ్యారు.
విద్యార్థినికి సన్మానం
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో బాసర మండలం కిర్గుల్ (బీ) గ్రా మానికి చెందిన ముత్యాల మనోరంజని అండర్–17 కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. దిలావర్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో తొమ్మిదోతరగతి చదువుతున్న మనోరంజ నిని బుధవారం ఎస్పీ జానకీ షర్మిల జిల్లా కేంద్రంలో సన్మానించారు. జాతీయస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ చాటాలని ఎస్పీ ఆకాంక్షించారు.
ఖానాపూర్/కడెం: సదర్‌మాట్ ప్రత్యేక కాలువ కోసం ఆయకట్టు రైతులు పోరుబాట పట్టారు. జిల్లాలోని మామడ మండలం పొన్కల్ సమీపంలో గోదావరినదిపై నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజీ నుంచి ఖానాపూర్ మండలం మేడంపల్లి సదర్‌మాట్ పాత ఆనకట్ట వరకు ఏడు కిలోమీటర్ల మేర ప్రత్యేక కెనాల్ నిర్మించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. సదర్‌మాట్ ప్రత్యేక కెనాల్ ఏర్పాటు చేస్తామని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఖానాపూర్ బహిరంగ సభలో ప్రకటించారు. అయినా నేటికీ ప్రత్యేక కాలువ ఏర్పాటు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రత్యేక కాలువ కోసం పాలకులు తగినచర్యలు చేపట్టకపోవడంతో సదర్‌మాట్ బ్యారేజీ ప్రారంభానికి సిద్ధమైన నేపథ్యంలో రైతులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. గతంలో ఈ విషయమై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక గేటుతో పాటు ప్రత్యేక కాలువ ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే.
సదర్‌మాట్ బ్యారేజీ
ఖానాపూర్, కడెం మండలాల్లోని 13వేల ఎకరాలకు సదర్‌మాట్ ద్వారా సాగునీరందుతుంది. కాలువకు నీరు విడుదల చేసినా చివరి ఆయకట్టు వరకు సక్రమంగా చేరకపోవడంతో ఏటా పంటలు ఎండిపోయే దుస్థితి ఎదురవుతోంది. ఇటీవల నిర్మించిన మినీ బ్యారేజీకి 1.58 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉంది. బ్యారేజీకి 55 గేట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు ప్రత్యేక గేటు ఏర్పాటు చేయలేదు. గేటు ఏర్పాటు చేయనప్పటికీ కనీసం ప్రత్యేక కాలువ ఏర్పాటు చేస్తేనైనా పంటలకు పుష్కలంగా సాగునీరందుతుందని రైతులు చెబుతున్నారు. కాలువ ఏర్పాటు చేయకపోతే గోదావరి నీరు వృథా అయ్యే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు.
ఏటా ఎండుతున్న రైతన్నల పంటలు
అన్నదాతల పోరుబాట
అన్నదాతల పోరుబాట


