సమ సమాజ నిర్మాణంలో గురువులే కీలకం
నిర్మల్ రూరల్: సమ సమాజ నిర్మాణంలో గురువులే ముఖ్యమని, ఏ కాలంలోనైనా గురువుకు ప్రత్యామ్నాయం లేదని డీఈవో భోజన్న అన్నారు. డిసెంబర్‌లో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులను డీఈఓ కార్యాలయంలో విద్యాశాఖ తరఫున సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడు తూ... ప్రస్తుత సమాజం గురువును చూసే దృష్టి కోణంలో మార్పు ఉందన్నారు. కానీ గురువుకు ఎప్పటికీ గౌరవం, ఆదరణ తగ్గదన్నారు. తాను డీఈవోగా ఎదగడానికి గురువులే కారణమని తెలిపారు. ఇందులో విద్యాశాఖ ఎస్‌ఓ లు, సమన్వయకర్తలు, వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


