ఎంపీ సుడిగాలి పర్యటన
ఖానాపూర్: పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. రాజూరా, చందునాయక్‌తండా, సింగాపూర్, ఎక్బాల్‌పూర్, సుర్జాపూర్ గ్రామాల్లో జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్‌తో కలిసి పర్యటించారు. బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులను సన్మానించారు. అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. కార్యక్రమాల్లో నాయకులు, సర్పంచులు ఆకుల శ్రీనివాస్, అంకం మహేందర్, పుప్పాల ఉపేందర్, కీర్తి మనోజ్, మల్లేశ్‌యాదవ్, బక్కశెట్టి వెంకట్రాములు, రెడ్డి లక్ష్మి, పెట్టెం రాద, హేమ్లానాయక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


