
విద్యా కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలి
నిర్మల్ రూరల్: పాఠశాల విద్యాశాఖ అమలు చేసే విద్యా కార్యక్రమాలను సజావుగా నిర్వహించాలని డీఈవో రామారావు సూచించారు. కలెక్టరేట్ సమావేశంలో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, కేజీబీ వీల ఎస్‌ఓలు, ఉపాధ్యాయులతో శనివారం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ నివేదికలను కచ్చితంగా రూపొందించాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్, ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీ, యూడైస్, ఇన్‌ఫ్రా వసతులు తదితర కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించాలన్నారు. వాటి రిపోర్టులు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, జిల్లాను ముందంజలో ఉంచాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించి జిల్లా తరఫున రాష్ట్రానికి ప్రాతిని ధ్యం చేయాలని పేర్కొన్నారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు ఈవిషయంలో శ్రద్ధ వహించాల ని సూచించారు. సమీక్షలో జిల్లా విద్యాశాఖ ఎఫ్‌ఏ వో జ్ఞానేశ్వర్, ఎస్‌వోలు రాజేశ్వర్, నరసయ్య, ప్రవీణ్‌కుమార్, లింబాద్రి, ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.