
గోదావర్రీ
బాసర: ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతోపాటు మూడు రోజలు జిల్లాలో కురిసిన వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజులుగా నాలుగ దశాబ్దాల క్రితం వరదను గుర్తుకుతెచ్చేలా మహోగ్రంగా ప్రవహిస్తోంది. దీంతో బాసర వద్ద వరద పోటెత్తుతోంది. ప్రసిద్ధ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం, వ్యాస భగవానుడి పాదాల వరకు వరద నీరు చేరింది. ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. కాటేజీలు, దుకాణాలు, ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. గోదావరి ఉప్పొంగడంతో బాసర మండలంలోని కిర్గుల్(బి) గ్రామంలో పత్తి, సోయా, వరి, కూరగాయలతో సహా వివిధ పంటలు వరద నీటిలో మునిగాయి. కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ దెబ్బతిన్న పంటలను శనివారం పరిశీలించారు.
పరిహారం ఇస్తామని హామీ..
కలెక్టర్ అభిలాష అభినవ్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. బిద్రెల్లి గ్రామంలో దెబ్బతిన్న సోయా, పత్తి, వరి పంటలను పరిశీలించి, వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించారు. నష్ట వివరాలను నమోదు చేసి నివేదిక పంపాలని ఆదేశించారు. కలెక్టర్ ఆలయం సమీపంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలని సూచించారు. రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సతీశ్‌వరరావు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గోదావరి ఉధృతి తగ్గకపోవడంతో ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు స్థానికంగా అందుబాటులో ఉంటున్నాయి.
ఎమ్మెల్యే సందర్శన..
ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధిత రైతులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశంలో నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ పటేల్, ఇతర నాయకులు ఉన్నారు.

గోదావర్రీ

గోదావర్రీ

గోదావర్రీ

గోదావర్రీ

గోదావర్రీ

గోదావర్రీ