
డీఈవోగా భోజన్న
నిర్మల్ రూరల్: జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా(ఎఫ్‌ఏసీ) డి.భోజన్న నియమితులయ్యారు. ఇప్పటి వరకు పని చేసిన రామారావు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రెండు నెలల క్రితమే వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం అనుమతించలేదు. తాజాగా జనగామ డీఈవో కార్యాలయంలో ఫైనాన్స్, అకౌంట్ ఆఫీసరుగా పనిచేస్తున్న భోజన్నను డీఈవోగా నియమిస్తూ శనివారం రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ మంజులాపూర్ ప్రాంతానికి చెందిన భోజన్న గతంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. తాజాగా జిల్లాకు డీఈవోగా పదోన్నతిపై వస్తున్నారు. సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు.