
వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్
సోన్: జిల్లాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద నష్టాలను పరిశీలించేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం సోన్ మండలంలో పర్యటించారు. వర్షాలతో ప్రభావితమైన ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు, రైతులతో మాట్లాడారు. ఆందోళన చెందవద్దని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నష్టాలకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నివేదికలను ప్రభుత్వానికి పంపించి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశుసంరక్షకులు, చేపలు పట్టేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132ను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్‌మార్, తహసీల్దార్ మల్లేశ్‌రెడ్డి, ఏఎంవో వినోద్‌కుమార్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు ఉన్నారు.