
రెండు ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్
ఖానాపూర్: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న రెండు ప్రైవేట్ ఆస్పత్రులను డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ గురువారం సీజ్ చేశారు. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులను నిర్వహిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశామని పేర్కొన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆస్పత్రులను సందర్శించగా పట్టణంలోని గీతా క్లీనిక్ పేరుతో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో ఆర్‌ఎంపీ ఇంజక్షన్లు ఇస్తున్నారని గుర్తించి సీజ్ చేశామన్నారు. సూర్య ఈఎన్‌టీ ఆస్పత్రిని తనిఖీ చేయగా ఆస్పత్రిలో అన్ని హంగులు ఏర్పాటుచేసి ప్రత్యేక యంత్రాలతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. వైద్యుడి పేరు లేకుండా ఆస్పత్రి నిర్వహించడంతోపాటు ఆస్పత్రి ఏర్పాటు విషయం జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోకపోవడంతో చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట జిల్లా నోడల్ అధికారి డాక్టర్ సౌమ్య, సిబ్బంది ఉన్నారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
మామడ: రోగులకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశా ఖ అధికారి రాజేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. వ్యాధులు ప్రబ లిన ప్రాంతంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందించాలని ఆదేశించారు. చికి త్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నిర్వహణ అధికారి సౌమ్య, విస్తరణ డిప్యూటీ అధికారి బారె రవీందర్, వైద్యాధికారి మౌనిక పాల్గొన్నారు.