నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Aug 14 2025 6:46 AM | Updated on Aug 14 2025 6:46 AM

నిర్మ

నిర్మల్‌

మళ్లీ పొడిగింపేనా?

సహకార సంఘాల పాలకవర్గాల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే ఆర్నెళ్లు పొడిగించిన ప్రభుత్వం ఈసారి తీసుకునే నిర్ణయం కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

9లోu

గురువారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2025

8లోu

పంద్రాగస్టుకు అతిథులు వీరే..

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అతిథులను ఖరారు చేసింది. వీరు శుక్రవారం ఉద యం 9.30గంటలకు జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరి స్తారు. అనంతరం నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలకు హాజరు కానున్నారు.

నిర్మల్‌ సిరిసిల్ల రాజయ్య

చైర్మన్‌, రాష్ట్ర ఆర్థిక సంఘం

ఆదిలాబాద్‌ మహ్మద్‌ అలీషబ్బీర్‌

ప్రభుత్వ సలహాదారు

ఆసిఫాబాద్‌ బండప్రకాశ్‌ డిప్యూటీ చైర్మన్‌,

శాసన మండలి

మంచిర్యాల హర్కర వేణుగోపాల్‌రావు

ప్రభుత్వ సలహాదారు

ఎస్‌హెచ్‌జీల్లోకి కిశోర బాలికలు

తొలగించిన వృద్ధులకూ చాన్స్‌

దివ్యాంగుల గ్రూపులు ఏర్పాటు

వీటిలో పురుషులకూ అవకాశం

లింకేజీ రుణాలిచ్చేలా నిర్ణయం

జిల్లాలో పెన్షన్ల వివరాలు

మొత్తం పింఛన్లు 1,47,103

వద్ధాప్య.. 35,150

వితంతు.. 36,326

వికలాంగుల.. 10,055

గీత కార్మికుల.. 274

పైలేరియా.. 223

డయాలసిస్‌.. 122

ఒంటరి మహిళ.. 2,110

బీడీ.. 62,062

గ్రామైక్య సంఘాలు 505

ఎస్‌హెచ్‌జీలు 12,215

ఎస్‌హెచ్‌జీల సభ్యులు 1,34,002

నిర్మల్‌చైన్‌గేట్‌: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భద్ర త, సామాజిక గుర్తింపునిచ్చిన మహిళా సంఘాలు మరింత విస్తృతమవుతున్నాయి. 60 ఏళ్లు దాటిన కారణంగా గతంలో సంఘాల నుంచి తొలగించిన మహిళలకు తిరిగి సభ్యత్వం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా జిల్లాలో అధికారులు కార్యాచరణ చేపడుతున్నారు. దీంతో మళ్లీ సంఘంలో చేరి తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని తోటి స భ్యులతో పంచుకునే అవకాశం వృద్ధ మహిళలకు లభించనుంది. కిశోర బాలికలు, దివ్యాంగులు, వృద్ధులకు సహకార సంఘాల్లో సభ్యత్వం ఇచ్చేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఇందిరా మహిళా శక్తి మిషన్‌లో భాగంగా ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది.

1,797 మంది కిశోర బాలికలకు చాన్స్‌

జిల్లాలో 15 నుంచి 18 ఏండ్లలోపు 1,797 మంది బాలికలున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ బాలికలతో కిశోర బాలికల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వారికి డబ్బులు పొదుపు చే యడంతో పాటు బ్యాంకింగ్‌ లావాదేవీలపై అవగా హన కల్పిస్తారు. అలాగే హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, మహిళలపై వేధింపులు, సోషల్‌ మీడియా ద్వారా జరిగే మోసాలు, బాలికలు, మహిళలపై జరిగే లైంగికదాడులతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నా రు. ఈ సంఘాల్లో బాలికలను చేర్పించడం కోసం సెర్ప్‌ అధికారులు, సిబ్బంది పాఠశాలలు, కళాశాల ల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు.

దివ్యాంగ సంఘాల్లో పురుషులూ..

జిల్లా వ్యాప్తంగా సుమారు 1,47,103 లక్షల మంది దివ్యాంగులు చేయూత పింఛన్లు పొందుతున్నారు. సీ్త్ర, పురుషులు అనే తేడా లేకుండా దివ్యాంగులందరినీ స్వయం సహాయక సంఘాల పరిధిలోకి తీసుకురాబోతున్నారు. వీరితో కూడా బ్యాంక్‌ ఖాతాలు తెరిపించడం, పొదుపు అలవాటు చేయడంతో పాటు వారికి సంఘాల ద్వారా ప్రభుత్వ పథకాలు అందేలా చూడనున్నారు. అలాగే దివ్యాంగులకు అవసరమైన వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు, ఇతర సహాయక పరికరాలనూ ఈ సంఘాల ద్వారా పంపిణీ చేసే అవకాశముంది. ఈ సంఘాల్లోని దివ్యాంగులకు మహిళా సంఘాలకు ఇచ్చినట్లే వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఇవ్వనున్నారు. ఒక్కో సంఘంలో ఏడు నుంచి 10 మంది సభ్యులు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు.

60 ఏండ్లు దాటిన వారికి మళ్లీ అవకాశం

ప్రస్తుతం 60 ఏండ్లు దాటిన మహిళలను స్వయం సహాయక సంఘాల నుంచి తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 60 ఏండ్లు దాటిన మహిళలతో మళ్లీ కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఏ ఆసరా లేని వృద్ధ మహిళలుంటే వారు చిరువ్యాపారాలు చేసుకునేందుకు సాయం చేయడం, కొడుకులు సరిగా చూ సుకోకపోతే ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంలో సా యం చేయడం, వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్నామని ఫీల్‌ కాకుండా నలుగురితో సంఘటితం చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

న్యూస్‌రీల్‌

కార్యాచరణ ఇలా..

12నుంచి 14వ తేదీ వరకు గ్రామాల్లో ఏ సంఘాల్లో లేని మహిళలు, దివ్యాంగులు, కౌమార బాలికలను డీపీఎంలు, సీసీలు, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో గుర్తిస్తారు. గ్రామాలవారీగా జాబితా రూపొందిస్తారు.

14నుంచి 15వ తేదీ వరకు కొత్త సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు సమావేశాలు నిర్వహిస్తారు. ప్రస్తుత సంఘాలు సాధించిన ఆర్థిక విజయాలు చెప్పడమే కాకుండా, ఆయా సభ్యుల అనుభవాలు, నిబంధనలు పరిచయం చేస్తారు.

15నుంచి 30వ తేదీ వరకు ముందుకువచ్చే సభ్యులతో సంఘాలు ఏర్పాటు చేసి, వారితో బ్యాంక్‌ల్లో పొదుపు ఖాతాలు తెరిపిస్తారు. వివరాలు ‘సెర్ప్‌’ వెబ్‌ సైట్‌లో నమోదు చేయిస్తారు.

అవగాహన కల్పిస్తున్నాం

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిశోర బాలికలు, దివ్యాంగులకు కొత్తగా నూతన మహిళా సంఘాల్లో సభ్యత్వం కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– అరుణ,

ఏపీఎం, నిర్మల్‌ రూరల్‌

నిర్మల్‌1
1/2

నిర్మల్‌

నిర్మల్‌2
2/2

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement