
బాసర మాస్టర్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్!
గతంలో వెనక్కి వెళ్లిన నిధులు
బాసర ఆలయానికి రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. గత ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌పై ప్రకటన చేసింది. ఇందుకోసం ఓ కమిటీ వేసింది. రూ.50 కోట్లు అప్పటికప్పు డు విడుదల చేసినప్పటికీ సక్రమంగా ఖర్చు చేయలేక సంబంధిత అధికారులు చేతులెత్తేశారు. అప్పట్లో దేవాదాయశాఖ నిర్లక్ష్యంతో విడుదలైన నిధుల్లో రూ.42 కోట్లు వెనక్కి వె ళ్లాయి. వాటిని తిరిగి తెప్పించాలని ఇప్పటివరకు ప్రయత్నం జరిగింది. ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణరా వు పటేల్, వేణుగోపాలాచారి అధికార కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రామారావు పటేల్ బాసర ఆలయాభివృద్ధి విషయంలో ఇప్పటికే అసెంబ్లీలో పలుసార్లు చర్చించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిని కూడా కలిశారు. అధికారులు, పార్టీలకు అతీ తంగా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతి నిధులు సమష్టి కృషి చేసి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.
● ప్రకటించిన దేవాదాయశాఖ మంత్రి
● ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు

బాసర మాస్టర్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్!