వ్యాపారుల సిండికేట్‌! | - | Sakshi
Sakshi News home page

వ్యాపారుల సిండికేట్‌!

Aug 14 2025 6:46 AM | Updated on Aug 14 2025 6:46 AM

వ్యాపారుల సిండికేట్‌!

వ్యాపారుల సిండికేట్‌!

● రెండుసార్లు వేలం వాయిదా ● మూడోసారి సజావుగా సాగేనా? ● ‘అడెల్లి’ ఆదాయం తగ్గించే కుట్ర!

సారంగపూర్‌: అడెల్లి ఆలయం వద్ద వివిధ హక్కుల కోసం నిర్వహించిన వేలం పాటలు వ్యాపారుల సిండికేట్‌ కారణంగానే రెండుసార్లు వాయిదా పడినట్లు తెలుస్తోంది. దేవాదాయశాఖ నిబంధనల ప్ర కారం గతేడాది ఆదాయానికి కొంత అదనంగా వస్తే నే వ్యాపారికి సదరు హక్కు కట్టబెడతారు. తక్కువ పాడితే వేలం వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇలా వరుసగా మూడుసార్లు వ్యాపారులు వేలం పాడేందుకు ముందుకు రాకపోయినా.. గతేడాది కంటే తక్కువ పాడినా.. వేలం రద్దు చేసే అధికారం దేవా దాయశాఖ అధికారులకు ఉంటుంది. ఆ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇదివరకు వచ్చి న ఆదాయ పరిమితిని తగ్గించి వేలం నిర్వహిస్తారు.

గతేడాది వేలం ద్వారా ఆదాయం

గతేడాది కొబ్బరి కాయల విక్రయ హక్కునకు రూ. 17.71లక్షలు, ప్యాలాలు, పుట్నాలు విక్రయానికి రూ.1.61లక్షలు, బొమ్మలు, సీడీలు, కంకణాలు వి క్రయానికి రూ.6.01లక్షలు, టోల్‌ ట్యాక్స్‌ వసూలు హక్కుకు రూ.15.51లక్షలు, తైబజారు వసూలుకు రూ.4.13లక్షలు, ఇడుపుడు పిల్ల మేకలు సేకరించే వ్యాపారానికి రూ.60వేలు, లడ్డూ, పులిహోర విక్ర య హక్కునకు రూ.1.60లక్షలు, పూలదండల విక్రయానికి రూ.1.60లక్షలు, టెంట్లు, వంటపాత్రలు అద్దెకు ఇచ్చే హక్కునకు రూ.1.65లక్షలు, ఒడిబి య్యం పోగు చేసుకునేందుకు రూ.2.25లక్షలు, చీరెలు, కనుములు పోగు చేసుకునే హక్కునకు రూ. 49వేలు, ఇతరములు–2 హక్కునకు రూ.80వేలు వచ్చింది. మొత్తంగా అమ్మవారి ఆలయానికి వేలం ద్వారా రూ.58.37లక్షల ఆదాయం సమకూరింది.

12 ఏళ్లుగా పెరుగుతూ వచ్చి..

కొబ్బరికాయల విక్రయం, తైబజారు వసూలు, టో ల్‌ట్యాక్స్‌ వసూలు, సీడీలు, బొమ్మలు, కంకణాల విక్రయం, పూలదండలు విక్రయ హక్కులకు 12 ఏ ళ్లుగా వ్యాపారులు గతం కంటే అధికంగా పాడుతూ హక్కులు దక్కించుకుంటున్నారు. ఈసారి తక్కువ కు పాడి హక్కులు దక్కించుకునేందుకు వ్యాపారులు కుట్ర చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకోసమే వారు సిండికేట్‌గా మారినట్లు తెలుస్తోంది. వీరి పాచిక పారితు ఆలయానికి గణ నీయంగా ఆ దాయం తగ్గే పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 18న మూడోసారి నిర్వహించే వేలం రద్దవుతుందో? సజావుగా సాగుతుందో చూడాలి మరి.

18న వేలం నిర్వహిస్తాం

వ్యాపార హక్కుల కోసం నిర్వహించే బహిరంగ వేలానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతోనే రెండుసార్లు వేలం పాటలు వాయిదా పడ్డాయి. ఈనెల 18న మళ్లీ వేలం నిర్వహించనున్నాం. మూడోసారి వాయిదా పడితే ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

– రమేశ్‌, ఆలయ ఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement