
‘వస్తాపూర్’ దశ మారేనా?
● జలపాతం వద్ద అధికారుల సర్వే ● సెలయేటి అభివృద్ధిపై ఆశలు
మామడ: చుట్టూ సహ్యాద్రి గుట్టలు.. దట్టమైన అట వీ ప్రాంతంలో ఉండే వస్తాపూర్ గ్రామ సమీపంలోగల జలపాతం పర్యాటకులను కనువిందు చే స్తోంది. జిల్లా కేంద్రం నుంచి 23 కిలోమీటర్ల దూ రంలో ఉన్న ఈ జలపాతం కొండలు, కోనల మధ్య నుంచి వచ్చే సహజ నీటి ప్రవాహంతో పర్యాటకుల కు ఆహ్లాదం అందిస్తోంది. ఈ వాటర్‌ఫాల్‌ను వీక్షించేందుకు ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంది.
సెలయేటికి వెళ్లడం ఇలా..
జిల్లా కేంద్రం నుంచి జాతీయ రహదారి వెంట 18 కిలోమీటర్ల దూరంలోని తాండ్ర గ్రామానికి చేరుకోవాలి. ఈ గ్రామం నుంచి ఐదుకిలోమీటర్ల దూ రం వెళ్తే వస్తాపూర్ గ్రామ సమీపంలోని జలపాతాని కి చేరుకోవచ్చు. తాండ్ర నుంచి వస్తాపూర్ గ్రామం వరకు ఉన్నది ఘాట్ రోడ్డు కావడంతో వా హనాల్లో నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచానికి దూరంగా గుట్టల్లో ఉన్న వస్తాపూర్ గోండు గిరిజన గ్రామానికి సమీపంలో నుంచి జాతీయ రహదారి రావడం, గ్రామానికి రోడ్డు నిర్మించడంతో పాటు జలపాతం వెలుగులోకి వచ్చింది. దీంతో ని త్యం గ్రామానికి సందర్శకులు వస్తారు. వానాకా లంలో జూలై నుంచి జనవరి వరకు ఈ జలపాతం తన అందాలతో సందర్శకులను మైమరిపిస్తోంది.
అభివృద్ధిపై ఆశలు
వస్తాపూర్ జలపాతానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఇటీవల కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. దీంతో తహసీల్దా ర్ శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, అటవీ, పోలీస్‌శాఖల అధికారులు మంగళవారం జలపాతా న్ని సందర్శించి సర్వే చేశారు. పూర్తి వివరాలు సేకరించారు. దీంతో వస్తాపూర్ జలపాతం పర్యాటకంగా అభివృద్ధి చెందనుందనే ఆశలు కలుగుతున్నా యి. జలపాతం వద్ద కనీస వసతులు లేక సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో పర్యాటకులు సందర్శించే స్థాయిలో జలపాతాలు ఏవీ లేవు. కొన్నేళ్ల క్రితమే వస్తాపూర్ జలపాతం వెలుగులోకి రాగా ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. జ లపాతం వరకు రోడ్డు సౌకర్యం కల్పించి, తాగునీరు, ఇతర వసతులు కల్పిస్తే దీనికి మంచి గుర్తింపు వస్తుందని పర్యాటకులు భావిస్తున్నారు.