
తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు
నిర్మల్‌చైన్‌గేట్: సమాచారం దాచిపెట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం చట్టవిరుద్ధమని రాష్ట్ర చీఫ్ ఇ న్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై పీఐవో అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో సమాచార కమిషనర్లు పర్వీన్, భూపాల్, కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలనలో పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించా లని సూచించారు. ఆర్టీఐ దరఖాస్తులు, ఫిర్యాదులు తక్కువగా వచ్చిన జిల్లాల్లో నిర్మల్ ఒకటని చెప్పా రు. పీఐవో అధికారులు దరఖాస్తుదారులకు నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి సమాచారం అందించారని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై అధికారులంతా అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లాలో ఆర్టీఐ అప్పీల్ కేసులను కలెక్టరేట్‌లో పరిష్కరించేందుకు కమిషన్ ప్ర త్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లు పర్వీన్, భూపాల్ మాట్లాడుతూ.. ఆర్టీఐని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత పీఐవో, ఏపీఐవోలదేనని చెప్పారు. కమిష న్ ఏర్పాటు తర్వాత 18వేల కేసుల్లో 2,300కుపైగా పరిష్కరించామని పేర్కొన్నారు. అనంతరం చట్టంపై సందేహాలను నివృత్తి చేశారు. పీఐవో అధికారులకు సమాచార హక్కు చట్టం నిబంధనలు, దరఖాస్తుల పరిష్కార విధానం, అప్పీల్ ప్రక్రియపై పవర్ పెయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్‌కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, వివిధ శాఖల అధికారులు, పీఐవోలు, ఏపీఐవోలు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి
కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు