
స్వర్ణ ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత
సారంగపూర్: ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో వి స్తారంగా వర్షాలు కురవడంతో స్వర్ణ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు (1.484 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,182.9 అడుగులకు చేరింది. 222 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అధికా రులు మూడో గేటు ఫీటు పైకెత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం నీటిమట్టం 1,182.9 అడుగుల వద్ద స్థిరంగా ఉంచామని ఏఈ మధుపాల్ తెలిపారు. రానున్న రెండు, మూడ్రోజులు వర్షాలు అధికంగా కురవనున్న నేపథ్యంలో నది పరీవాహక ప్రాంతానికి పశువుల కాపరులు, మత్స్యకారులు, రైతులు వెళ్లవద్దని సూచించారు.
‘కడెం’కు భారీ వరద
కడెం: పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. బుధవారం ప్రాజెక్ట్‌కు 40,066 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో అప్రమత్తమైన అధికారులు మూడు వరద గేట్లు ఎత్తి 18,322 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమ ట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 696.275 అ డుగులు ఉంది. కాగా, బుధవారం ప్రాజెక్ట్ అందా లు తిలకించేందుకు పర్యాటకులు తరలివచ్చారు. యువకులు, చిన్నారులు ప్రాజెక్ట్ వద్ద సెల్ఫీలు దిగుతూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు.

స్వర్ణ ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత