
గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ పంజాబీ దాబా వద్ద మంగళవారం టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుబడినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. రెబ్బెన మండలం ఖైర్‌గాంకు చెందిన గన్నా శ్రవణ్‌కుమార్, మహారాష్ట్రలోని రాజూరకు చెందిన అరున్ రామారావు ముమారే వద్ద నుంచి 60 గ్రాముల (10 ప్యాకిట్లు) గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు సంజీవ్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.