
మస్తిష్క నియంత్రణ అమరిక ఫలితంగానే...
గర్భస్థదశలో శిశువు ఉన్నప్పుడు ఏర్పడిన జన్యు ప్రభావంతోనే ఎడమచేతివాటంగా జన్మిస్తారు. కొందరిలో వంశపారంపర్యంగా, పరిసర కారకాల ప్రభావంతో కూడా ఏర్పడుతుంది. వారు ప్రతీపనిని ఎడమచేతితో చేసేందుకు ప్రయత్నిస్తారు. మస్తిష్కనియంత్రణ అమరిక ఫలితంగా కూడా ఎడమ చేతివాటం ఏర్పడుతుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. వీరు అందరిలోకన్నా భిన్నత్వాన్ని, మేధాశక్తిని అధికంగా కలిగి ఉంటారని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సమాజంలో ప్రత్యేక నైపుణ్యాలతో పేరు ప్రతిష్టలు పొందిన వారిలో చాలామంది ఎడమచేతివాటం వారే.
– అప్పాల చక్రధారి, సీనియర్ పిల్లల వైద్యనిపుణులు, నిర్మల్