
కుడి.. ఎడమైతే!
● నేడు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ● అందరిలో ప్రత్యేకతగా.. ● ఉమ్మడి జిల్లాలోనూ ఎడమచేతివాటం వ్యక్తులు
ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు నిర్మల్ జిల్లాలోని గుండంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సిలారి మధు, విద్యార్థులు. ఉపాధ్యాయుడితో పాటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న దాదాపు పదిమంది విద్యార్థులు ఎడమ చేతివాటం కలిగి ఉన్నారు. పాఠ్యాంశ బోధనలోనూ ఎడమవైపు చేతిద్వారానే అనువుగా ఉంటుందని చెబుతున్నారు. మిగతా వారితో పోల్చితే ఎడమచేతివాటం కలిగిన విద్యార్థులు విద్య, విద్యేతర విషయాల్లో చురుగ్గా ఉన్నారని వారు పేర్కొంటున్నారు.
నిర్మల్‌ఖిల్లా: కుడిఎడమైతే పొరపాటు లేదోయ్...అన్నాడో సినీ కవి.. అంటే వ్యక్తిలోని భిన్నత్వాన్ని బట్టి ప్రత్యేకతను ఆపాదిస్తాం. ఎడమ చేతివాటం అనేది జన్యు ప్రభావ ఫలితంగా ఏర్పడిందని వైద్య పరిశోధనలు సైతం రుజువు చేస్తున్నాయి. సమాజంలోని మనుషులలో ప్రతిఒక్కరూ భిన్నమైన గుణాన్ని కలిగి ఉంటారు. అందులో కొందర్ని మాత్రం ప్రత్యేకతను బట్టి సులభంగా గుర్తిస్తాం. చిన్ననాటి నుంచే జన్యు ప్రభావ ఫలితంగానే కుడి, ఎడమ చేతివాటాలు సంభవిస్తాయని సైన్స్ చెబుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎడమ చేతి వాటం కలిగినవారు పలువురు ఉన్నారు. నేడు ప్రపంచ ఎడమ చేతివాటం వ్యక్తుల దినోత్సవం (వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే)గా జరుపుకుంటున్న నేపథ్యంలో సాక్షి కథనం.
ప్రోత్సహిస్తేనే మంచిది..
ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్య వయస్సులో పిల్లలు వస్తువులను పట్టుకోవడం మొదలుపెడతారు. ఈ సమయంలోనే కుడి, ఎడమ చేతివా టాలను గుర్తించవచ్చు. ఎడమ చేతి వాటాన్ని తల్లిదండ్రులు ఒక చెడు అలవాటుగా భావించి మాన్పించేందుకు ప్రయత్నం చేస్తారు. అలా చేయడం వల్ల ఇతర సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కుడి.. ఎడమైతే!