
కొలాం గిరిజనుల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలోని కొలాం గిరిజనుల విద్యాభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏటీడీవో క్రాంతికుమార్ అన్నారు. మంగళవారం కొలాం హబిటేషన్ గ్రామాలైనా కొత్తపల్లి–హెచ్ కొలాంగూడ, భీంపూర్ కొలాంగూడ, బొజ్జుగూడలలో నూతనంగా ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలాం గిరిజన పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. సీఆర్‌టీలను నియమించి విద్యాబోధన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పీఎం జన్‌మన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం బలిరాం, ఎస్‌సీఆర్‌పీ రాజబాబు, విజయ్‌కుమార్, సీఆర్‌టీ రోహిదాస్ చౌహాన్, రామేశ్వర్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.