చెక్‌పోస్టు తనిఖీ చేసిన సీఐ
జన్నారం: మండలంలోని ఇందన్‌పల్లి గ్రామంలో ఏ ర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును ఇటీవల బాధ్యతలు స్వీకరించిన లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి తని ఖీ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను తరలించే అవకాశం ఉన్నందువల్ల ముందస్తుగా ప్ర తీ వాహనాన్ని తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు.
ఒకరిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన మహ్మద్ అలీమొద్దీన్ సోమవారం మహారాష్ట్ర నుంచి పశువులను తీసుకువచ్చి వధించేందుకు సిద్ధంగా ఉంచాడు. తన ఇంటి ముందు కట్టి ఉంచిన ఎనిమిది ఎద్దులను వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకొని గోశాలకు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు.


