ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గౌరవ అతిథులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సోమవారం ఉదయం 9.55 గంటలకు సమీకృత కలెక్టరేట్ ఆవరణలోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. 10 గంటలకు ముఖ్య అతిథి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. 10.05 గంటలకు పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తారు. 10.07 నుంచి 10.20 గంటల వరకు అతిథుల ప్రసంగం, 10.20 నుంచి 11గంటల వరకు వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, 11.15 తేనేటి విందు తదితర కార్యక్రమాలుంటాయి.
జిల్లా కేంద్రంలో సిద్ధమవుతున్న వేదిక


