
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్టౌన్: వేసవి నేపథ్యంలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20 వరకు జరుగుతాయన్నారు. వారం రోజులు ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, గ్యాస్ గోదాములు, పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభాకర్, నిర్మల్ స్టేషన్ అధికారి రాజలింగం, సిబ్బంది అజయ్ కుమార్, సునీల్, హుస్సేన్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.