ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన

Mar 16 2025 12:20 AM | Updated on Mar 16 2025 12:21 AM

లక్ష్మణచాంద మండలంలో..

లక్ష్మణచాంద: మండలంలోని బాబాపూర్‌ జిల్లా పరిషత్‌ సెకండరీ, పార్పెల్లి మండల ప్రాథమిక పాఠశాలల్లో ఏఈ ఆధారిత విద్యాబోధనను ఎంఈవో అశోక్‌వర్మ శనివారం ప్రారంభించారు. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు బీ, సీ గ్రేడ్‌ల విద్యార్థులకు కృత్రిమ మేధా ద్వారా చేపడుతున్న బోధనను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీరోజు విద్యార్థులందరినీ గ్రూపులుగా విభజించి విషయాల వారీగా ఏఐ ఆధారిత విద్యాబోధన చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు ధర్మేంద్ర, కిష్టయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, నగేశ్‌, రాజన్న, నారాయణ, సీఆర్పీ సుధాకర్‌ పాల్గొన్నారు.

నిర్మల్‌ రూరల్‌: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ తెలిపారు. శనివారం నిర్మల్‌ రూరల్‌ మండలం మేడిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌తో కలిసి ఏఐ ఆధారిత కంప్యూటర్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు ద్వారా ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, గణిత శాస్త్రంలోని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో 16 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత కంప్యూటర్‌ ల్యాబ్‌లను ప్రారంభించామని పేర్కొన్నారు. మూ డు నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఏఐ ఆధారిత విద్యా యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లు ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని గుర్తించి మెరుగుపరిచేందుకు దో హదం చేస్తాయని తెలిపారు. ఏఐ ఆధారిత యాప్‌ లు కథలు, వీడియోలు, ఆటల ద్వారా పిల్లల్లో చదవడం, లెక్కించడం మీద ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సును వినియోగించుకుని ప్రతీ విద్యార్థి ప్రాథమిక విద్యలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు. ప్రతీ విద్యార్థి ఆరోగ్యం, విద్య, ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టా లని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతీరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. ఆమె వెంట డీఈవో పీ రామారావు, తహసీల్దార్‌ సంతోష్‌, ఎంపీడీవో గజేందర్‌, విద్యాశాఖ అధికారులు సలోని, ప్రవీణ్‌, లింబాద్రి, ఉపాధ్యాయుడు నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

ఏఈ ఆధారిత బోధన పరిశీలన

ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన 1
1/1

ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement