
పనులు పరిశీలిస్తున్న డీఆర్డీవో విజయలక్ష్మి
నర్సాపూర్ (జి): ఉపాధి కూలీలందరికీ పని కల్పించాలని డీఆర్డీవో విజయలక్ష్మి సూచించారు. మండలంలోని నందన్ గ్రామ చెరువులో పూడికతీత పనులను గురువారం పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. ఉష్ణోగ్రతలు ఎ క్కువగా ఉన్న దృష్ట్యా కూలీలు 10:30 లోపు ప నులు ముగించుకుని ఇళ్లకు వెళ్లాలని సూచించా రు. కూలీలకు సరిపడా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తగు జా గ్రత్తలు పాటిస్తూ ఉపాధి పనులు చేయాలని తె లిపారు. అనంతరం నర్సరీని సందర్శించి పె రుగుతున్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీవో సుగుణ, టెక్నికల్ అసిస్టెంట్లు రవీందర్, సతీశ్, ఫీల్డ్ అసిస్టెంట్ భూమేశ్ పాల్గొన్నారు.