
జందాపూర్ వద్ద విరిగిపడిన విద్యుత్ స్తంభం
తాంసి: భీంపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు బుధవారం రాత్రి అంధకారంలో ఉన్నారు. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ సమీపంలోని పంటచేనులో 33 కేవీ విద్యుత్ స్తంభం విరిగి నేలకొరగడంతో నిపాని, అర్లి(టి) సబ్‌స్టేషన్‌లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి పోయింది. దీంతో మండలంలోని భీంపూర్, వడూర్, ధనోర, నిపాని, అర్లి, గోన, కరంజి(టి), గుబిడి, వడ్‌గాం, తాంసి(కె), గొల్లఘాట్ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం ఉదయం ఏఈ శ్రావణ్ కుమార్ సిబ్బందితో కలిసి మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.