దేవుడా..నా కూతుర్ని ఎందుకు చంపేశావ్.! | Young Woman Ends Life In Karnataka | Sakshi
Sakshi News home page

దేవుడా..నా కూతుర్ని ఎందుకు చంపేశావ్.!

Mar 16 2025 1:49 PM | Updated on Mar 16 2025 1:49 PM

Young Woman Ends Life In Karnataka

శివమొగ్గ: ఇంట్లో నీటి ట్యాంక్‌ నింపాలని మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేయబోయిన యువతి కరెంటు షాక్‌ కొట్టి మరణించింది. ఈ దుర్ఘటన శుక్రవారం రాత్రి జిల్లాలోని హొళెహొన్నూరు సమీపంలోని ఎమ్మెహట్టి గ్రామంలో జరిగింది. మృతురాలు నిసర్గ (18). ఆమె హొళెహొన్నూరులోని ప్రభుత్వ కాలేజీలో పీయూసీ చదివేది. షాక్‌తో యువతి అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. అప్పటివరకూ కళ్లముందున్న కూతురు క్షణాల్లో విగతజీవి కావడంతో తల్లిదండ్రులు బోరుమన్నారు. 

మరణంలోనూ జీవనదానం
శివమొగ్గ: బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ వ్యక్తి అవయవాలను దానం చేయడం ద్వారా మృతుని కుటుంబం పుట్టెడు దుఃఖంలోనూ మానవత చాటిన ఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. వివరాలు.. కృషినగర 1వ క్రాస్‌ నివాసి ఎస్‌సీ రమేష్‌ (57) అనే వ్యక్తి ఈనెల 10న సాయంత్రం ఆకస్మికంగా స్పృహ తప్పి పడిపోయారు. 

 ఆస్పత్రికి తీసుకెళ్లగా మెదడులో రక్తస్రావం జరిగి బ్రెయిన్‌డెడ్‌ అని డాక్టర్లు నిర్థారించారు. వైద్యుల అభ్యర్థన మేరకు ఆయన భార్య సవిత, కుమారుడు నిశ్చిత్, కుటుంబ సభ్యులు అవయవాల దానానికి అంగీకరించారు. ఆయన దేహం నుంచి గుండె, మూత్రపిండాలు సహా పలు ముఖ్య భాగాలను సేకరించి అవసరమైన రోగుల కోసం ఆగమేఘాల్లో తరలించారు.  సోలార్‌ రమే‹Ùగా శివమొగ్గలో పేరొందిన రమేష్‌  చనిపోతూ పలువురికి సాయం చేశారని బంధుమిత్రులు నివాళులు అరి్పంచారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement