సూపర్‌గా డ్యాన్స్‌ చేస్తున్న యువతి..ఒక్కసారిగా.. | Young Lady Collapsed On Stage While Dancing In Marriage Party | Sakshi
Sakshi News home page

సూపర్‌గా డ్యాన్స్‌ చేస్తున్న యువతి..ఒక్కసారిగా కుప్పకూలి..

Feb 9 2025 8:07 PM | Updated on Feb 9 2025 8:21 PM

Young Lady Collapsed On Stage While Dancing In Marriage Party

భోపాల్‌:అప్పటిదాకా ఆ యువతి పెళ్లి వేడుకలో ఆనందంతో డ్యాన్స్‌ చేస్తోంది. ఇంతలోనే ఒక్కసారిగా డ్యాన్స్‌ ఆపేసి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిషలో జరిగింది. తన సోదరి వివాహం సందర్భంగా స్టేజీపై డ్యాన్స్‌ చేస్తూ యువతి కుప్పకూలి కింద పడిపోయింది. 

కుప్పకూలిన యువతిని బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే  ఆ యువతి ప్రాణాలు కోల్పోయినట్లు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సంబరాలు జరగాల్సిన పెళ్లింట్లో తీవ్ర విషాదం నెలకొంది. 

 యువతి అప్పటిదాకా ఆకట్టుకునే విధంగా డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొవిడ్‌ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువైపోయాయని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అసలు ఈ మరణాలకు సరైన కారణాన్ని కనుక్కోవాలని వారు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement